'వేసవిలో దొంగతనాల పట్ల అప్రమత్తత అవసరం'
NLG: వేసవి కాలంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కట్టంగూరు ఎస్సై రవీందర్ సూచించారు. ఇళ్లకు వెళ్లేటప్పుడు తలుపులు, కిటికీలు సరిగ్గా లాక్ చేయాలని, విలువైన వస్తువులను భద్రపరుచుకోవాలని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.