'ఆ విషయంలో మోదీకి, చంద్రబాబుకు అర్హత లేదు'

'ఆ విషయంలో మోదీకి, చంద్రబాబుకు అర్హత లేదు'

KDP: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పదే పదే ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడం, ఆ సాకుతో కాంగ్రెస్‌ను విమర్శించడం గర్హనీయమని మాజీ ఎంపీ తులసి రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఎమర్జెన్సీకి బ్రహ్మరథం పట్టారన్నారు. 1977లో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గాను 41 స్థానాలలో కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు.