షార్ట్ సర్క్యూట్ రూ.7 లక్షల ఆస్తి నష్టం

షార్ట్ సర్క్యూట్  రూ.7 లక్షల ఆస్తి నష్టం

NLR: మనుబోలు మండలంలోని వీరంపల్లి పంచాయతీ నాయుడుపల్లి గ్రామంలో సోమవారం ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. రైతు రావూరి వెంకటసుబ్బయ్య, సుబ్బమ్మ కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 7 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. రూ. 2 లక్షల నగదు, నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.