రూ.కోటితో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు

KRNL: నగర వ్యాప్తంగా మురుగు కాలువల్లో పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి టి.జి.భరత్ ఆదేశాలతో సోమవారం నుంచి రూ.కోటితో 150 మంది ప్రత్యేక సిబ్బంది 52వార్డుల్లో ఈ పనులు ప్రారంభించినట్లు నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు. ఇప్పటికే 50 మంది సిబ్బందితో పాతబస్తీలో పనులు జరుగుతుండగా, ఇప్పుడు నగర వ్యాప్తంగా పనులు ప్రారంభమయ్యాయి.