మేడారం జాతరలో 30 వైద్య శిబిరాలు: DMHO
ములుగు DMHO డా. గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో 30 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. నిన్న మేడారంలో ఉప వైద్యాధికారి, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో కలిసి పర్యటించిన ఆయన, శిబిరాల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలను పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సిబ్బందిని నియమించుకుని, భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.