'గొర్రెల, మేకలకు వెంటనే నట్టల మందులు పంపిణీ చేయాలి'
BHNG: గొర్రెల, మేకలకు వెంటనే నట్టల నివారణ మందులు పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం GMPS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడున్నర సంవత్సరాలుగా నట్టల నివారణ మందులు పంపిణీ చేయకపోవడంతో గొర్రెలు నాణ్యత తగ్గి కాపరులు నష్టపోతున్నారని అన్నారు.