'పెండింగ్ పనులపై దృష్టి సారించాలి'
PPM: పాలకొండ పంచాయతీ రాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.రాధారాణి గురువారం కలెక్టర్ డా, ప్రభాకర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై దృష్టి సారించాలన్నారు.