'కాలనీ ఆర్చీల ఏర్పాటు అభినందనీయం'

'కాలనీ ఆర్చీల ఏర్పాటు అభినందనీయం'

నల్గొండ 20వ డివిజన్ లక్ష్మీ బాలాజీ కాలనీలో ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఆర్చీలను కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్, ఎస్సై సైదులు ప్రారంభించారు. కాలనీ వాసుల చొరవ అభినందనీయమని వారు కొనియాడారు. భద్రత కోసం ప్రతి కాలనీలో ఆర్చీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఐక్యమత్యంతో కాలనీలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.