VIDEO: వైభవంగా కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
NGKL: లింగాల మండలంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామ నామ తారక మంత్ర హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.