మిడుతూరులో వర్షానికి కూలిపోయిన ఇల్లు
KDP: ఖాజీపేట మండలం మిడుతూరు ఎస్సీ కాలనీలోని సంబటూరు వెంకటమ్మ నివాసం వర్షాల కారణంగా కూలిపోయింది. ఇల్లు కోల్పోయి బాధితురాలు వెంకటమ్మ తీవ్ర ఆందోళనలో ఉందని స్థానికులు పేర్కొన్నారు. దీన్ని గమనించిన జిల్లా కలెక్టర్, మండల అధికారులు వెంటనే సాయం అందించాలని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కిరణ్, సర్పంచ్ చంద్ర కూడా బాధితకు వెంటనే సహాయం అందించాలి అని పిలుపునిచ్చారు.