నేరాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ
PLD: నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని ఎస్పీ బీ. కృష్ణారావు సూచించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.