చరిత్రలో పామర్రు 'పుల్లేరు'

కృష్ణా: పూర్వంలో కృష్ణానదికి పాయగా పామర్రు మీదుగా ప్రవహించిన యేరు "ఫుల్లుల యేరు"గా ప్రసిద్ధి చెందింది. అదే తరువాత "పుల్లేరు"గా మారింది. అప్పట్లో రోడ్డు రవాణా సౌకర్యం లేకపోవడంతో పుల్లేరు ద్వారా నీటి రవాణా సాగించేవారు. 1855లో ప్రకాశం బ్యారేజి నిర్మాణ సమయంలో దీన్ని త్రవ్వి విస్తరించారు. 1947లో గుడ్లవల్లేరు లాంచీలు ఇక్కడి నుంచి ప్రయాణించేవి.