నేడే కోరల పున్నమి(కుడుముల పండుగ)
హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉండటంతో వ్యాధులు తొలగిపోతాయి. అందుకే మార్గశిర పౌర్ణమి రోజున ఆయన్ను ఆరాధిస్తారు. ఈ రోజున చిత్రగుప్తుడి సోదరి కోరల అమ్మవారిని పూజిస్తారు. మార్గశిర పౌర్ణమి నాడు కోరలను పూజించేవారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని చిత్రగుప్తుడు ఆమెకు వరం ఇచ్చాడు. ఈ రోజును కోరల పున్నమి అని అంటారు.