నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వేముల

NLG: నార్కెట్‌పల్లి మండలం తొండల్ వాయి గ్రామంలో దెంగి రాములు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో గ్రామ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.