డీఈవో పైచర్యలు తీసుకోవాలని ఎంపీకి విజ్ఞప్తి

డీఈవో పైచర్యలు తీసుకోవాలని ఎంపీకి విజ్ఞప్తి

WGL: డీఈవో మామిడి జ్ఞానేశ్వర్ పై చర్యలు తీసుకోవాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఎంపీ కడియం కావ్యను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ పరుష పదజాలంతో దూషిస్తున్న డీఈవోను జిల్లా నుంచి సాగనంపాలని కోరారు.