'బాల్య వివాహాలను అరికట్టేందుకు కృషి చేయాలి'

'బాల్య వివాహాలను అరికట్టేందుకు కృషి చేయాలి'

ప్రకాశం: బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్వయంకృషి సేవా సంస్థ అధ్యక్షులు నాయబ్ రసూల్ అన్నారు. మంగళవారం పామూరు మండలంలోని ఇన్నిమెర్లలో మహిళా సుష్యక్షమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు అరికట్టేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని గ్రామస్తులను కోరారు.