హైకోర్టులో నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక విచారణ
HYD: హైకోర్టులో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక విచారణ జరగనుంది. ఎన్నికల ప్రక్రియపై జరుగుతున్న కసరత్తులు, ప్రభుత్వ నిర్ణయం గురించి అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని న్యాయవాది సురేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. గతంలో ఆర్టికల్ 243(E) (3) ప్రకారం గడువు ముగిసిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలన్నారు.