శ్రీ కన్యకాపరమేశ్వరిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: విజయనగరం పట్టణంలో గల శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్బంగా అమ్మవారిని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు బుధవారం దర్శించుకున్నారు. ఈసందర్బంగా ఆలయ అర్చకులు ఆమెకు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.