కనిగిరిలో ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే సమీక్ష
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు, సిబ్బందితో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పేద రోగుల పట్ల ప్రేమతో, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.