VIDEO: 'మబ్బులు మాయగా సముద్ర తీర ప్రాంతం'

NLR: విడవలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండలంలోని పలు ప్రాంతాల్లో మోస్తారుగా వర్షం కురిసింది. రామతీర్థం సముద్ర తీర ప్రాంతం మబ్బులు మయంగా కనిపించింది. సముద్రంలో అలలు సాధారణంగానే ఉన్నాయి. ఆకాశంలోని మేఘాలన్నీ నల్లగా మారిపోయాయి. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది.