అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
అన్నమయ్య: అక్రమంగా తరలించడానికి సిద్దం చేసిన 10,794 కిలోల రేషన్ బియ్యాన్ని రాజంపేట మండల పరిధిలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మన్నూరు పంచాయతీ పరిసరాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని ఆదివారం తరలించడానికి వాహనంలో సిద్ధం చేశారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి వాహనంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.