'నిబంధనాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలి'
WNP: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్‌ఏ క్యూ నిబంధనల ప్రకారం మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. శుక్రవారం పానగల్ మండల కేంద్రంలోని ఐకేపీ వరి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అన్ని రిజిస్టర్లు సరిగ్గా నిర్వహించాలని, కొనుగోలులో ముందుగా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.