రేపు వీ.కోటలో పర్యటించనున్న ఎమ్మెల్యే
CTR: వీ.కోట మండలంలో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి బుధవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటలకు గోసుమాకుల పల్లెలో పర్యటన ప్రారంభిస్తారని వెల్లడించారు. మధ్యాహ్నం మూడు గంటలకు కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లెలో పర్యటిస్తారని, ప్రజలు, కార్యకర్తలు దీనిని గమనించి విజయవంతం చేయాలని కోరారు.