VIDEO: కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆగ్రహం
కోనసీమ: కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం నవబు పేట గ్రామంలో పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ నేతలు తెలిపారు. ఈ విషయంపై గ్రామస్థులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ తమన శీను ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.