అరుదైన గుడ్లగూబ పిల్లకు ప్రాణరక్షణ

అరుదైన గుడ్లగూబ పిల్లకు ప్రాణరక్షణ

NLG: నకిరేకల్ మండలం చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం అరుదైన అంతరించిపోతున్న గుడ్లగూబ జాతి పిల్ల కనిపించింది. నేలపై పడిఉన్న గుడ్లగూబని గమనించిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో ప్రధానోపాధ్యాయులు నవీన్ రెడ్డి ఈ విషయాన్ని అటవీశాఖ బీట్ ఆఫీసర్ అశోక్ రెడ్డికి సమాచారమిచ్చారం ఇవ్వగా, అక్కడకు చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు.