మున్నేరు వాగును పరిశీలించిన కలెక్టర్

NTR: జగ్గయ్యపేట లింగాల వద్ద మున్నేరు వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆదివారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్, ఖమ్మం ఏరియాలో కురిసిన వర్షాలకి మున్నేరు వాగుకి వరద ఉధృతి పెరగటంతో లోతట్టు పరివాహ ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు.