రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి: సీపీఐ

W.G: ఆగష్టు 23, 24, 25, తేదీల్లో ఒంగోలులో జరుగుతున్న సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ భీమవరం సీపీఐ జిల్లా కార్యాలయంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు పాల్గొని మాట్లాడారు. ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.