రాష్ట్రస్థాయి సాప్ట్ బాల్ టోర్నమెంట్ వాయిదా..!
W.G: డిసెంబర్ 2, 3, 4వ తేదీల్లో వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జెడ్పీ హైస్కూల్లో జరగవలసిన సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ వాయిదా పడిందని స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శులు డి.సునీత, పి.ఎస్.ఎన్.మల్లేశ్వరరావు సోమవారం తెలిపారు. అండర్-17 బాల బాలికల అంతర్ జిల్లాల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ కం స్టేట్ టీం సెలక్షన్ కార్యక్రమాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు.