'మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు'
SRCL: వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని బోయినపల్లి ఎస్సై రమాకాంత్ హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన ‘డ్రంక్ అండ్ డ్రైవ్' తనిఖీల్లో పలువురిపై కేసులు నమోదు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహన పత్రాలను వెంటే ఉంచుకోవాలని సూచించారు.