గాలివాన బీభత్సం, నెలకొరిగిన విద్యుత్ స్తంభాలు

గాలివాన బీభత్సం, నెలకొరిగిన విద్యుత్ స్తంభాలు

NRML: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలో బలమైన గాలులు వీయడంతో చింత కుంటలో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు, నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు విరిగి వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.