'పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి'
ప్రకాశం: మార్కాపురం మున్సిపాలిటీ 22వ బ్లాక్ కొండపల్లి ప్రాంతంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పర్యటించారు. డ్రైనేజీ సమస్యలు, రోడ్డు సమస్యలు ఉన్నాయని ఆ ప్రాంతవాసులు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.