రోడ్డు ప్రమాదం.. మహిళకు గాయాలు

BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు దాటుతున్న రత్తమ్మ అనే మహిళను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో రత్తమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను టోల్ ప్లాజా ఆంబులెన్స్‌లో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.