VIDEO: రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్సీ
KMM: కూసుమంచి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, MLC తాతా మధుసూదన్ ఆదివారం సందర్శించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని గణపేశ్వరాలయంలో స్వామివారికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.