షూటింగ్ పూర్తి చేసుకున్న సుధీర్ మూవీ
సుడిగాలి సుధీర్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'G.O.A.T'. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, తను నిర్మించిన సినిమాలలో మంచి చిత్రంగా ఈ మూవీ నిలుస్తుందని నిర్మాత చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు.