లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
VZM: గజపతినగరం పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.