ఉదయం కాంగ్రెస్‌లో..సాయంత్రం బీఆర్ఎస్‌లో

మహబూబ్ నగర్: షాద్‌నగర్ పట్టణానికి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ అనంతయ్య గంటల వ్యవధిలోనే మాట మార్చారు. ఉదయం 11:00 గంటల ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ సాయంత్రం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి మీడియా ముందుకొచ్చారు. అనివార్య కారణాలవల్ల కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవాల్సి వచ్చిందన్నారు.