మేడారం రావద్దని పూజారుల సంఘం విజ్ఞప్తి

మేడారం రావద్దని పూజారుల సంఘం విజ్ఞప్తి

MLG: తాడ్వాయి మండలం మేడారంలో భారీ వర్షాల కారణంగా జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. చిలకలగుట్ట పరిసరాలు, గద్దెల సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావద్దని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు భక్తులకు మంగళవారం విజ్ఞప్తి చేశారు.