ఘనంగా జింక మల్లన్న స్వామి బోనాల పండుగ

ఘనంగా జింక మల్లన్న స్వామి బోనాల పండుగ

JGL: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఆదివారం రోజున జింక మల్లన్న స్వామి జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆచారవంతులు, యాదవ సంఘ సహకారంతో చేసిన జాతర మహోత్సవం ఆద్యంతం భక్తి భావాన్ని పెంపొందించాయి. కేతమ్మ మల్లన్నల కళ్యాణ మహోత్సవం కన్నులపండుగగా నిర్వహించారు. భక్తులకు మహా అన్నప్రసాదం అందజేశారు. మహిళలు భక్తిశ్రద్దలతో మల్లన్న స్వామివారికి బోనాలు సమర్పించారు.