అదనపు ఇళ్లను కేటాయించాలని మంత్రికి వినతి

అదనపు ఇళ్లను కేటాయించాలని మంత్రికి వినతి

ADB: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ హైదరాబాద్‌లో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బోథ్ నియోజకవర్గానికి అదనపు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.