VIDEO: అనాధ పిల్లల పుట్టినరోజు వేడుకలు..కెనడా దేశస్తుల సందడి
WGL: వర్ధన్నపేట పట్టణంలో బాలవికాస ఆధ్వర్యంలో అనాధ పిల్లల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుధవారం కెనడా దేశానికి చెందిన అతిథులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలవికాస కోఆర్డినేటర్ పిట్టల రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు విదేశీ అతిథులను భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా దండలు వేసి, గంధం పూసి ఆహ్వానించారు.