VIDEO: పైప్‌లైన్ పగిలి మిషన్ భగీరథ ట్యాంక్ నీరు వృథా
NRML: నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని పశు వైద్యశాల వద్ద గల మిషన్ భగీరథ ట్యాంకు పైప్‌లైన్ పగిలి మంచినీరు రోడ్డుపై వృథాగా పోతోంది. వేసవిలో నీటి ఎద్దడి పొంచి ఉన్న తరుణంలో, భారీగా నీరు వృథా అవుతుండటంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.