గాగిల్లాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎర్రల జానకి ఆధ్వర్యంలో పేదల కోసం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సలహాలు, ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ANM, గ్రామ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.