గుత్తి కోట ఉత్సవాల లోగో విడుదల
ATP: జిల్లాలోని చారిత్రక గుత్తి కోట వైభవాన్ని చాటిచెప్పేలా ఈనెల 14, 15 తేదీల్లో 'గుత్తి కోట ఉత్సవాలు-2026' నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన లోగోను అధికారులు విడుదల చేశారు. రెండు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో స్థానిక సంప్రదాయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పర్యాటక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.