పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు
E.G: నిడదవోలు పురపాలక సంఘం 60 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన ఆర్వోబి పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.