VIDEO: 'అరెస్టులతో ఉద్యమాలు ఆగవు'
KRNL: ఆదోని జిల్లా ఏర్పాటయ్యే వరకూ నిరసనలు ఆపబోమని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. అరెస్టులతో ఉద్యమాలను అణచగలమనేది ప్రభుత్వ భ్రమ అన్నారు. ఇవాళ తమ డిమాండ్ నెరవేర్చేంత వరకు భారీ స్థాయిలో పోరాటాలు కొనసాగుతాయని విద్యార్థి సంఘాల నాయకులు ఉదయ్, పలువురు హెచ్చరించారు. ప్రజలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని వెల్లడించారు.