పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. టవర్ ఎక్కిన ప్రియుడు
RR: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలకుంటలో గల రేడియో స్టేషన్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్‌చల్ చేస్తున్నాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం లేదని టవర్ ఎక్కినట్లు సమాచారం. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.