ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవించగా, వారి నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.