గన్నవరం విమానాశ్రయంలో సినీ తారల సందడి
కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో సినీ తారల సందడి నెలకొంది. బెంగళూరు విమానాశ్రయం నుంచి టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ గురువారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం విజయవాడలోని ఏలూరు రోడ్డులో ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.