పిడుగుపాటుతో చెట్టు దగ్ధం

KRNL: పత్తికొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో సోమవారం ఆకాల వర్షంలో భీభత్సం సృష్టించింది. తుగ్గలి మండల కేంద్రంలో చెట్టు పడిన పిడుగుదాటికి చెట్టు దగ్ధమైంది. ఉరుములు, మెరుపులతో పిడుగు పడటంతో ఓ చెట్టుకు మంటలు చెలరేగాయి. ఈ ఘటన స్థానికులకు తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, అయితే చెట్టు పూర్తిగా కాలిపోయింది.