ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
KMM: ఖమ్మం నగరంలోని శ్రీస్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం గుట్టపై చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం సంచలనం రేపింది. మృతుడు లెనిన్ నగర్‌కు చెందిన బానోతుల శ్రీధర్ (56)గా గుర్తించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఇచ్చిన సమాచారంతో టూ టౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ మేరకు ఆధారాల సాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.